వంకాయ కూర

RUCHI
RUCHI

వంకాయ కూర

కావలసినవి:
తెల్లవంకాయలు-250గ్రా.లు ఉల్లిపాయలు-2, పచ్చిమిర్చి-5 పసుపు-పావ్ఞటేబుల్‌స్పూన్‌, జీలకర్ర- ఒక టేబుల్‌స్పూన్‌ కొబ్బరిపొడి- మూడు టేబుల్‌స్పూన్లు, పల్లీలు-మూడు టేబుల్‌స్పూన్లు నువ్ఞ్వలు-రెండు టేబుల్‌స్పూన్లు, మెంతులు-పావ్ఞ టేబుల్‌స్పూన్‌ పెరుగు-అర టేబుల్‌స్పూన్‌, అల్లం వెల్లుల్లి ముద్ద-పావ్ఞ టేబుల్‌స్పూన్‌, ఉప్పు-తగినంత నూనె-నాలుగు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర, మెంతులు-పావ్ఞటేబుల్‌స్పూన్లు కొత్తిమీర -కొద్దిగా

తయారుచేసే విధానం

ఈ కూర తెల్ల వంకాయలతో చేస్తే బావ్ఞంటుంది. ముందుగా గిన్నె లేదా కడాయి వేడిచేసి జీలకర్ర, నువ్ఞ్వలు, మెంతులు, పల్లీలు దోరగా వేయించి పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి తీసి పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న దినుసులు పొడిచేసుకుని వేయించిన ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, పసుపు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. కడాయిలో మిగిలిన నూనె వేసి వేడిచేసి జీలకర్ర, మెంతులు వేసి మెత్తబడ్డాక గుత్తులుగా లేదా పెద్ద ముక్కలుగా తరిగిన వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్కలు కాస్త మెత్తబడ్డాక రుబ్బిన మసాలా, కప్పుడు నీళ్లుపోసి ఉడికించాలి. కూర ఉడికి నూనె తేలిన తర్వాత కొత్తిమీర వేసి దింపేయాలి.