బొప్పాయి కూటు

RUCHI
RUCHI

బొప్పాయి కూటు

కావలసినవి:
పచ్చిబొప్పాయి-1 చింతపండు-నిమ్మకాయంత చిన్న ఉల్లిపాయలు-2, ఉప్పు-తగినంత ఎండుమిరపకాయలు-4, కొబ్బరికోరు-రెండు టేబుల్‌స్పూన్లు వేయించిన శనగపప్పు-25గ్రా. మినపప్పు-ఒక టేబుల్‌ స్పూన్‌, ధనియాలు-ఒక టేబుల్‌ స్పూన్‌ జీలకర్ర-అర టీస్పూన్‌, పసుపు-అర టీ స్పూన్‌

తయారుచేసే విధానం

బొప్పాయి కాయపై చర్మం చెక్కి కాయను చిన్న ముక్కలుగా కోసుకోండి. చింతపండులో ఒక కప్పు వేడినీరు పోసి ఐదు నిమిషాలు నానబెట్టి పిండిరసం తీసుకోండి. ఖాళీ పెనంమీద ధనియాలు, మినపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేయించి కొబ్బరికోరు, ఉల్లిపాయ, వేరుశనగ పప్పులతో కలిపి మెత్తగా, ముద్దగా నూరుకోండి. బొప్పాయి ముక్కలలో చింతపండు రసం పోసి ఉడికించండి. సగం ఉడికిన తరువాత మిగిలిన దిను సులన్నీ కలపండి. ముక్కలు చక్కగా మెత్త బడేంత వరకు ఉడికించి, దించి, కొత్తిమీర ఆకులను చల్లి వడ్డించండి. చపాతీలు లేదా ఐస్‌తో ఇది బాగుంటుంది.