బ్రెయిన్‌ మసాలా

RUCHI--
RUCHI–

బ్రెయిన్‌ మసాలా

కావలసినవి

3 లాంబ్‌ బ్రెయిన్‌, 1 గరిటెడు గరం మసాలా 1/2 చెంచా ఆవపొడి 1 చెంచా కారం 2 చెంచాలు సన్నగా తరిగిన అల్లం 2 పచ్చిమిరపకాయలు 1 ఉల్లిగడ్డ తరగాలి 1 చెంచా ఉప్పు లేదా తగినంత 2 టమాటాలు సన్నగా తరగాలి 2 గరిటెలు సన్నగా తరిగిన కొత్తిమీర బ్రెయిన్‌ ఉడకడానికి తగినన్ని నీళ్లు

తయారుచేసే విధానం:
కొద్దిగా నీళ్లుపోసి ఆవపొడి వేసి బ్రెయిన్‌ను 5 నిమిషాలు ఉడికించాలి. తరువాత బ్రెయిన్‌ నుంచి నీటిని వంపి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిముక్కలు వేయించాలి.తరువాత టమాటా ముక్కలు వేసి కొద్దినిమిషాలు వేయించి గరంమసాలా వెయ్యాలి. కారం, అల్లం, ఉప్పు వేసి వేయించాలి. ఇందులో కొద్దిగా నీరు పోసి అడుగు అంటకుండా కలుపుతుండాలి. ఇందులో ఉడికించిన బ్రెయిన్‌ వేసి చిన్న చిన్న ముక్కలుగా చేస్తూ కలపాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసి అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు మిగిలిన టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఉంచి స్టౌమీద నుంచి దించి,వేడి వేడి చపాతీలోకి సర్వ్‌ చెయ్యండి.