శనగపిండి అట్ల గ్రేవీ కూర

RUCHI
RUCHI

శనగపిండి అట్ల గ్రేవీ కూర

కావలసినవి
శనగపిండి- 100గ్రా.లు ఉల్లిపాయలు-2, కరివేపాకు-రెండు రెబ్బలు కారంపొడి- రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి-రెండు టేబుల్‌స్పూన్లు పసుపు-అర టేబుల్‌స్పూన్‌, జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌ అల్లంవెల్లుల్లి ముద్ద-ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, లవంగాలు-4, ఇలాచీలు-3 దాల్చిన చెక్క-చిన్నముక్క, సాజీర-అర టేబుల్‌స్పూన్‌ పెరుగు-పావుకప్పు, కొబ్బరిపొడి-మూడు టేబుల్‌స్పూన్లు గసగసాలు-రెండు టేబుల్‌స్పూన్లు, టమాటాలు-2, ఉప్పు-తగినంత నూనె-ఐదు టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
కడాయి లేదా గిన్నె వేడిచేసి గసగసాలు వేయించి కొబ్బరితో కలిపి పొడిచేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి, చెంచాడు కారంపొడి, అరచెంచా అల్లంవెల్లుల్లి, పావ్ఞ చెంచా పసుపు చెంచాడు ధని యాలపొడి తగినంత ఉప్పు వేసి కలిపి నీళ్లుపోసి కాస్త పలుచగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. రొట్టెల పెనం వేసి కొద్దిగా నూనె రాసి గరిటెడు పిండి వేసి కాస్త మందంగా అట్లు వేసుకోవాలి. చుట్టూ పైన మరికొంచెం నూనె వేయాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపున కూడా ఎర్రగా కాల్చి పక్కన పెట్టుకోవాలి.

ఇలా మొత్తం పిండితో అట్టు చేసుకుని కాలిన తర్వాత చాకుతో నలుచదరంగా కోసి పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో మూడు చెంచాల ఇలా మొత్తం పిండితో అట్టు చేసుకుని కాలిన తర్వాత చాకుతో నలుచదరంగా కోసి పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో మూడు చెంచాల నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. అవి కాస్త రంగు మారుతున్నప్పుడు పసుపు, కరివేపాకు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్ది వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన టమాట ముక్కలు, కారంపొడి, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాట ముక్కలు మెత్తబడ్డ తర్వాత పెరుగు కొబ్బరి, గసగసాల పొడి అరకప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. చివరిగా ముందుగా చేసి పెట్టుకున్న అట్లు తునకలు (ముక్కలు) వేసి కలిపి మూతపెట్టి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి.