రవాణాశాఖకు ఒక్కరోజే రూ.30 లక్షలు

0001 కోసం ఘర్షణ
9999 నంబరుకు రూ. 10 లక్షలు

RTO central zone
RTO central zone, hyd

ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌లోని సెంట్రల్‌ జోన్‌లో రవాణాశాఖ సోమవారం నిర్వహించిన నంబర్ల వేలంలో ఒక్క రోజే రూ.30,55,748 లక్షల రాబడి లభించింది. ఒక్క 9999 నంబరు రూ.10 లక్షలు పలికింది. ప్రస్తుతం టిఎస్‌ 09 ఎఫ్‌ఈ సిరీస్‌ ముగుస్తున్నందున 9999 నంబరును ఎన్‌ఎస్‌ఎల్‌ ప్రాపర్టీస్‌ సంస్థ రూ.10లక్షలు చెల్లించి కైవసం చేసుకుంది. పాత సిరీస్‌ ముగిసి టీఎస్‌ 09 ఎఫ్‌ఎఫ్‌లోకి అడుగుపెట్టింది. అందులో 1 నంబరును ఎఫ్‌ఆర్‌ఆర్‌ హిల్‌ హోటల్స్‌ రూ.6.95 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. 99 నంబరును ఎమర్జిన్‌ అగ్రినోవా సంస్థ రూ.2.78 లక్షలు చెల్లించి దక్కించుకుంది. కొత్త సిరీస్‌లో 0001 కోసం ఓ వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/