ఏపికి ఆర్టీజీఎస్ హెచ్చరిక

అమరావతి: ఏపిలో అధిక ఉష్ణోగ్రత వల్ల వడగాల్పులు వీచే అవకాశమున్నట్లు ఆర్టీజీఎస్ హెచ్చరింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నట్లు తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. వృద్ధులు, చిన్నారులు ఎండల్లో తిరగకుండా వీలైనంత వరకు నీడలోనే ఉండాలని కోరారు.ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, గుంటూరు, విజయనగరం చిత్తూరు, కృష్ణా, అనంతపురం జిల్లాలతోపాటు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు 45 నుండి 47 డిగ్రీలకు పైగా నమోదవుతాయని ఈ మేరకు ఆర్టీజీఎస్ నిపుణులు అంచనా వేశారు.
తాజా క్రీడ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/