చినజీయర్‌స్వామిని కలిసిన ఆర్టీసి కార్మికులు

Chinjayar swamy
Chinjayar swamy

హైదరాబాద్‌: నెల రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని ఆర్టీసి కార్మిక నేతలు ముచింతల్‌ ఆశ్రమంలో చినజీయర్‌ స్వామిని కలిసి మొరపెట్టుకున్నారు. చినజీయర్‌ స్వామికి తమ సమస్యల గురించి ఒక వినతిపత్రం అందజేశారు. దీనికి స్వామిగారు సానూకులంగా స్పందించారు. ఆర్టీసి కార్మికుల సమ్మె 26వ రోజుకు చేరింది. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని సర్కారు చెబుతుండగా ..విలీనం చేయాల్సిందేనని కార్మికులు పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంలో హైకోర్టులో వాదనలు జరుగుతున్న ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పు లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సమ్మె రోజు రోజుకు తీవ్రం కావడంతో కార్మికులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. హైదరాబాద్‌లో కొందరు ఆర్టీసి కార్మికులు..టిఆర్‌ఎస్‌కు ఓటేసి తప్పు చేశామని ముక్కు నేలకు రాసి మరీ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించని పక్షంలో మరింత తీవ్ర పరిస్థితులు ఏర్పడుతాయని కార్మికులు ఆందోలన వ్యక్తం చేశారు. సమ్మె నేపథ్యంలో ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు, అటు కార్మికలకు కష్టాలు తప్పడం లేదు.
తాజా బిజినెస్‌ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/