సబితాఇంద్రారెడ్డిని అడ్డగించిన ఆర్టీసి కార్మికులు

Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

వికారాబాద్‌: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని ఆర్టీసి కార్మికులు అడ్డుకున్నారు. యాలాల మండలంలోని లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తా సమీపంలో పత్తి విక్రయ కేంద్రం ప్రారంభానికి వెళుతున్న ఆమెను అడ్డగించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. అందుకు సమాధానంగా మంత్రి ముందు విధులకు హాజరు కావాలని, అనంతరం మాట్లాడుకుందామని సిఎం కెసిఆర్‌ చెప్పారని అన్నారు. కాగా కార్మికులు సిఎం అలా అనలేదని, మేడం మీరు హామీ ఇస్తేనే తాము విధుల్లో చేరతామని కార్మికులు మంత్రితో చెప్పారు. అందరు విధుల్లో చేరాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రిని మించి ఇంకెవరూ లేరని ఆయనే చెప్పిన తర్వాత ఇంకేముందని సబితాఇంద్రారెడ్డి కార్మికులను ప్రశ్నించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/