యధావిధిగా ఆర్టీసీ కార్మికుల సమ్మె

యధావిధిగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
TSRTC JAC Convener Ashwathama Reddy

Hyderabad: ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతల సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరమని, మిగతా 23వేల కార్మికులను ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. డిపో మేనేజర్లు రేపటి నుంచి సమ్మెకు మద్దతు ఇవ్వాలన్నారు. ఉద్యోగుల పొట్టగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. కమిటీ వేసి మా డిమాండ్లపై చర్చించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలను పరిష్కరిస్తే యూనియన్లను వైండప్‌ చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు ఎలా ఇస్తారో చెప్పాలన్నారు. కార్మికులను భయపెట్టే ధోరణిని వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్మికులెవరూ విధుల్లో చేరొద్దన్నారు.  చర్చలు జరిపితే సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామన్నారు. చర్చలు లేబర్‌ యాక్ట్‌ ప్రకారం జరగాలన్నారు.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/