ఖమ్మం బస్టాండ్‌ వద్ద ఆర్టీసి కార్మికుల ఆందోళన

TSRTC Strike
TSRTC Strike

ఖమ్మం: ఆర్టీసి కార్మికులు సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు మళ్ళీ మొదటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసి కార్మికులు సమ్మె బాట పట్టారు. కాగాఆర్టీసి కార్మికులు ఆందోళన చేపట్టడంతో ఖమ్మం బస్టాండ్‌ వద్ద వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసి కార్మికులు, కాంగ్రెస్‌, బిజెపి, వామపక్షాల నేతలు బస్టాండ్‌లోకి చొచ్చుకు వెళ్ళేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆర్టీసి కార్మికులు పోలీసులను తప్పించుకుని బస్టాండ్‌లోకి పరుగు తీశారు. కార్మికులు బస్సులను అడ్డగించి ఆందోళనకు దిగారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లపై ఆర్టీసి కార్మికులు దాడికి పాల్పడటంతో ఖమ్మం బస్టాండ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business