ఆర్టీసీ కార్మికులను అడ్డుకుంటున్న పోలీసులు

ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్

rtc
rtc

హైదరాబాద్‌: విధుల్లో చేరేందుకు ఆర్టీసీ డిపోలకు చేరుకుంటున్న ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురవుతోంది. కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ ఇప్పటికే ప్రకటించారు. దీంతో విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను డిపోల వద్ద అధికారులు అడ్డుకుంటున్నారు. విధుల్లోకి తీసుకోవాలని తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మరోవైపు, విధుల కోసం వస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుండడంతో డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విధులకు ఆటంకం కలిగిస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలలోని 9 డిపోలతోపాటు హైదరాబాద్‌లోని హయత్‌నగర్, జూబ్లీ బస్ డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. తాత్కాలిక కార్మికులను అడ్డుకుంటున్న వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/