ఆర్టీసి మహిళా కార్మికులు ఎంజిబిఎస్‌లో నిరసన దీక్ష

TSRTC Strike
TSRTC Strike

హైదరాబాద్‌: ఆర్టీసి మహిళా కార్మికులు ఎంజిబిఎస్‌లో నిరసన దీక్షకు దిగారు. ఈ దీక్షకు ఆర్టీసి జేఏసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మద్దతు ప్రకటించారు. సోమవారం డిపోలు, బస్టాండ్ల దగ్గర సేవ్‌ ఆర్టీసి పేరుతో నిరసనలు చేపట్టనున్నట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. 51 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి కార్మికుల సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమన్నారు. మరోవైపు ప్రైవేటు బస్సులకు రూట్‌ పర్మిట్లపై హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసిపై సోమవారం లేదా మంగళవారం సిఎం కెసిఆర్‌ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. మరోపక్క ఆర్టీసి జేఏసి సమ్మె విరమించి విధుల్లో చేరతాం అని ప్రకటించిన నేపథ్యంలో సిఎం నుంచి స్పందన వస్తుందేమోనని వేచి చూస్తున్నారు. ప్రైవేట్‌ బస్సులకు పర్మిట్లపై చర్చించడానికి కేబినేట్‌ సమావేశం కూడా అయి ఉండవచ్చని కీలక సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national