మేడారం జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు

తెలంగాణలోని 51 ప్రాంతాల నుంచి 4 వేల బస్సులు

Medaram Jatara
Medaram Jatara

మేడారం(వరంగల్‌): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం… తెలంగాణలోని 51 ప్రాంతాల నుంచి 4000 బస్సుల్ని వేస్తున్నట్లు…
ఆర్‌టిసి యాజమాన్యం తెలిపింది. ఫిబ్రవరి 2న మేడారం మహా జాతర మొదలవుతుంది. అందువల్ల ఫిబ్రవరి 2 నుంచీ 8 వరకు… వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌
ఆర్‌టిసి రీజినల్‌ నుంచి ఆర్‌టిసి ప్రత్యేక బస్సు సేవలు అందించబోతోంది. మొత్తం 23 లక్షల మందిని తరలించాలని ఆర్‌టిసి లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మేడారం విధుల్లో 12,500 మంది
ఆర్‌టిసి అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మేడారం పరిసరాల్లో మొత్తం 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2020 ఫిబ్రవరి 5న సారలమ్మ, పగిడి గిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. ఫిబ్రవరి 6న సమ్మక్క గద్దెకు చేరుతుంది. 7న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/