కార్మికశాఖ కమీషనర్‌కు హైకోర్టు ఆదేశం

సమ్మెపై నిర్ణయం తీసుకోవాలని సూచన

High Court of Telangana
High Court of Telangana

హైదరాబాద్‌: హైకోర్టులో ఆర్టీసి సమ్మెపై విచారణ ముగిసింది. కార్మికశాఖ కమీషనర్‌ను సమ్మెపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. సమ్మె చట్టవిరుద్ధమని హైకోర్టు ప్రకటించలేదని స్పష్టం చేసింది. చర్చల విషయంలో ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయలేమని, ఒత్తిడి చేయడం వల్ల చర్చలు జరగవని పేర్కొంది. చర్చలు సామరస్యంగా స్వచ్ఛందంగా జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే సమ్మె చట్టవిరుద్దమా, చట్టబద్దమా అని నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు ఉందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టీసి జేఏసి తరపు న్యాయవాది జయప్రకాశ్‌రెడ్డి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, కానీ వారి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం సముఖంగా లేదని ఆర్టీసి ఎండి అఫిడవిట్‌లో పేర్కొన్నారని వెల్లడించారు. అయితే ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. కాగా కార్మికులు విధుల్లో చేరితే వారిపై ఆర్టీసి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోరనే నమ్మకం ఉందని హైకోర్టు తెలిపింది.
తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh