చెన్నైలో ఆర్టీసి సమ్మె

వేతనాల్లో కోత వదంతులతో సమ్మెకు పిలుపు

RTC strike at chennai
RTC strike at chennai

చెన్నై: చెన్నై వాసులు సమస్యలతో సతమతమవుతున్న సమయంలో వారికి మరో సమస్య తలెత్తింది. ఇప్పటికే నీటి సమస్యతో అల్లాడుతున్న జనానికి ఆర్టీసి ఉద్యోగులు సమ్మె సైరన్‌తో ఇంకా ఆందోళన పెరిగింది. జూన్‌ నెల వేతనాల్లో కోత విధిస్తున్నారని రెండు మూడు రోజుల నుంచి వదంతులు రావడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తూ నెలాఖరులో రావాల్సిన వేతనాలు ఆలస్యం కావడం, మరికొందరికి ఖాతాల్లో తక్కువ జమకావడంతో ఉద్యోగులు నిజమేనని భావించారు. దీంతో సోమవారం సమ్మెకు పిలుపునిచ్చారు. దాదాపు 22వేల మంది ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఎక్కడ బస్సులు అక్కడ నిలిచిపోయాయి.
దీనిపై స్పందించిన అధికారులు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. వారాంతం కావడంతో బ్యాంకుల్లో నిధుల జమకు అంతరాయం ఏర్పడిందని వివరణిచ్చారు. ఇప్పటికే కొంతమందికి పూర్తి స్థాయిలో జీతాలు అందాయని మరికొంత మందికి చెల్లిస్తామని తెలిపారు. ఆర్టీసీ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/