ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు


విధులకు హాజరుకాని ఉద్యోగులపై వేటు వేయాలి

kcr
kcr

హైదరాబాద్‌: టీఎస్సార్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు చేస్తున్న సమ్మెపై సీఎం కెసిఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇకపై ఆర్టీసీ ప్రైవేట్ భాగస్వామ్యంతో బస్సులు నడుస్తాయని, ఆర్టీసీ నడిపే బస్సుల్లో సగం ప్రైవేట్ బస్సులు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలు కూడా ఉండవని, బ్లాక్ మెయిల్ చేస్తే ప్రభుత్వం తలవంచదని తేల్చి చెప్పారు. ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులేనని, కొన్ని రోజుల్లోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని ప్రకటించారు. కొత్తగా చేరే ఉద్యోగులు యూనియన్ లో చేరబోమని సంతకం చేయాలని అన్నారు.


తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/