పల్లెవెలుగు బస్సుల రంగులు మార్పుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం

పల్లెవెలుగు బస్సుల రంగులు మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధం అవుతుంది. దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పల్లెవెలుగు బస్సులను తీసుకొచ్చారు. పాసుపు ఆకుపచ్చ , తెలుపు రంగులలో ఈ బస్సులకు కలర్ వేసి పల్లెల్లో నడిపించడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ బస్సులు అదే కలర్ లో నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో పల్లెవెలుగు బస్సుల రంగులు మార్చేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్దమవుతుంది.

ప్రధాన కార్యాలయం నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు… జిల్లాల్లోని అన్ని పల్లెవెలుగు బస్సులు రంగులు మార్పు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు పల్లెవెలుగు బస్సులు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులతో ఉండగా ఇప్పుడు వీటిలో పసుపు రంగును తొలగించనున్నారు. మిగతా మూడు రంగుల తో పాటు కొత్తగా గచ్చకాయ రంగు వినియోగిస్తూ డిజైన్ కొంచెం మార్పు చేస్తున్నారు అధికారులు. మొదటగా రాజమహేంద్రవరంలోని ఆర్టీసీ బస్సుల రంగు మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.