విపక్ష నేతలతో సమావేశమైన ఆర్టీసీ జేఎసీ

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ జేఏసీ మరోసారి విపక్ష నాయకులతో సమావేశమైంది. ఎంప్లాయిస్ యూనియన్ ఆఫీస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో ఆర్టీసీ జేఏసీ కేంద్రాన్ని కలిసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి జేఏసీ నాయకులు అశ్వద్ధామ రెడ్డి, రాజి రెడ్డి, సుధ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వామపక్ష నేతలు తమ్మినేని వీరభద్రం, పోటు రంగారావు తదితరులు హాజరయ్యారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/