ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఐకాస కన్వీనర్‌

ashwathama reddy
ashwathama reddy

హైదరాబాద్‌: ఉద్యమాన్ని ఉద్దృతం చేసే క్రమంలో నిరహార దీక్షలు చేపట్టాలని ఆర్టీసీ ఐకాస, అఖిలపక్షం నిర్ణయించింది. నిరాహార దీక్షలకు పోలీసులు అనుమతించకపోవడంతో అశ్వత్థామరెడ్డి స్వీయగృహ నిర్భందాన్ని విధించుకొని నిరహార దీక్ష చేపట్టారు. గృహనిర్భందంలో ఉన్న అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించే సమయంలో ఆర్టీసీ కార్మికులకు పోలీసులకు మధ్య తొపులాట జరిగింది. అనంతరం ఆయన్ను బలవంతంగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆయన ఆసుపత్రిలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డిని పలువురు రాజకీయ నాయకులు, ఆర్టీసీ ఐకాస నేతలు పరామర్శించారు. కాగా అశ్వత్థామరెడ్డి మధుమేహం, రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు తక్షణ వైద్యం అందించకపోతే ప్రాణానికే ముప్పు అని ఉస్మానియా ఆర్‌ఎంవో రాజ్‌కూమర్‌ వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో వైద్యానికి సహకరించాలని వైద్యులు అశ్యత్థామరెడ్డిని కోరారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/