సిద్దిపేటలో ఆర్టీసి కార్మికుల మానవహారం

RTC Strike
RTC Strike

సిద్దిపేట: ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరతామని, అయితే ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వం సానుకూలంగా స్పందిచని నేపథ్యంలో ఆర్టీసి ఐకాస పిలుపు మేరకు సిద్దిపేటలో ఆదివారం కార్మికులు నిరసన చేపట్టారు. ఆర్టీసి కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న దీక్షా శిబిరం నుంచి బస్‌ డిపో వరకు ర్యాలీగా బయల్దేరి, సిద్దిపేట డిపో వద్ద రహదారిపై మానవహారం నిర్వహించారు. పదిహేను నిమిషాలకు పైగా నిరసనలు వ్యక్తం చేశారు. అనంతరం ఆచార్య జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఆర్టీసి సమ్మెలో అమరులైన కార్మికులకు మౌనం పాటించి నివాళులు అర్పించారు. కాగా కార్మికులకు మద్దతుగా సిపిఎం ఏఐటియూసి నాయకులు నిరసనలో పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. ఆర్టీసి కార్మికులు సమ్మె చేపట్టి నేటికి సరిగ్గా 51 రోజులు గడచిన సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/