ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసి చార్జీల పెంపు

apsrtc
apsrtc

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసి చార్జీలు పెంచుతున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. పెంచిన చార్జీలు రేపు ఉదయం నుంచి అమలు చేస్తున్నట్లు ఎపీఎస్‌ ఆర్టీసి వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెంచిన చార్జీలు పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులో కిలోమీటరుకు 20 పైసలు పెంచారు. ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. అంతేకాకుండా సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని ఆర్టీసి యాజమాన్యం తెలిపింది. కాగా డీజిల్‌ ధర గత నాలుగేళ్లలో లీటర్‌ ఒక్కింటికి రూ.49 నుంచి రూ.70 చేరిందని డీజిల్‌ పెంపు కారణంగా సంస్థకు ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోందని వివరించింది. ఇంకా బస్సుల విడిభాగాలు, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల మేర భారం పడుతోందని అందుకే చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని ఆర్టీసి యాజమాన్యం పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/