ఆర్టీసీ ఉద్యోగులకు వరుస శుభవార్తలు..

ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్..ఆర్టీసీ ని లాభాల్లోకి తేవడమే కాదు ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వరుస శుభవార్తలు ప్రకటిస్తున్నారు. మూడేళ్ల విరామం తర్వాత 5 శాతం కరువు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు రీసెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన గురించి ఇంకా అంత మాట్లాడుతుండగానే మరో శుభవార్త తెలిపారు. ఈరోజు గురువారం తార్నాక‌లోని ఆర్టీసీ ఆస్ప‌త్రిలో న‌ర్సింగ్ కాలేజీ, ఆక్సిజ‌న్ ప్లాంట్ ప్రారంభోత్సం జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో సజ్జనార్ మాట్లాడుతూ..ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అన్ని విధానాలుగా ఆరోగ్యవంతంగా ముందుకు వెళుతుందన్నారు.

ఆర్టీసీ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ల సహకారం, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డిల నేతృత్వంలో ఎన్నో కీలక నిర్ణయాలతో ముందుకు వెళుతున్నామన్నారు. ఉత్తమ పనితీరు కనబర్చిన సిబ్బందికి ఇక నుంచి ప్రతి ఏటా అవార్డులు అందజేయనున్నట్టు తెలిపారు. ఆర్టీసీలో కారుణ్య నియమకాల ప్రక్రియ వేగవంతం చేస్తామని ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ స్ప‌ష్టం చేశారు. తొలివిడతలో 200 నుంచి 300 వరకు కారుణ్య నియామకాలు త్వరలోనే చేపడతామని ప్ర‌క‌టించారు.