హైదరాబాద్లో RSS భారీ శిబిరం

హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ భారీ శిబిరం తెలంగాణలో ఏర్పాటైంది. RSSఏర్పడి 2025 నాటికి వందేళ్లు పూర్తవుతుంది. అప్పటికల్లా తెలంగాణ అంతటా విస్తరించేలా ప్లాన్ సిద్ధమైంది. ఇందుకోసం నేటి నుంచీ 3 రోజుల పాటు హైదరాబాద్ ఔట్స్కర్ట్స్లోని నవభారత్ ఇంజనీరింగ్ కాలేజీలో ‘విజయ సంకల్ప శిబిరం’ పేరుతో భారీ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తోంది. ఇందులో RSS చీఫ్ మోహన్ భగవత్… 8000 మంది శిక్షక్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కుటుంబ విలువలు, గో సేవ, గ్రామ వికాసం, హిందూ ధర్మ ప్రచారం, జల సంరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణ, సామాజిక సామరస్యం వంటి అంశాలపై ఈ ట్రైనింగ్ ఉంటుంది. వచ్చే నాలుగేళ్లలో కార్యప్రముఖ్లు చేయాల్సిన విధులపై మోహన్ భగవత్ దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణలోని కోరుట్లలో మొట్టమొదటి RSS శాఖ 1936లో ఏర్పడింది. గత 60 ఏళ్లలో తెలంగాణాలో 2000 సంఘ్ శాఖలు ఏర్పడ్డాయి. ఒక్క 2019 లోనే 1000 శాఖలు పెరిగాయి. ఒక్క హైదరాబాద్లోనే 789 బస్తీల్లో 800 శాఖలున్నాయి. ఈ ఏడాది RSS 1600కు పైగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/