ఆరెస్సెస్‌కు ఎవరి పట్లా ద్వేషం లేదు

Bhubaneswar: ఆరెస్సెస్‌కు ఎవరి పట్లా ద్వేషం లేదని ఆ సంస్థ అధినేత మోహన్ భగవత్ చెప్పారు. కేవలం హిందువులను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని మార్చాలన్నదే తమ ధ్యేయమని, దేశాన్ని ప్రగతిపథంలోకి నడిపించాలన్నదే లక్ష్యమని ఆయన చెప్పారు. ”ఆరెస్సెస్‌కు ఎవరి పట్లా ద్వేషం లేదు. ఉత్తమ సమాజం నిర్మించడానికి మనం కలిసి పని చేస్తూ దేశం మొత్తాన్ని అభివృద్ధి చేయాలి” అని ఆయన అన్నారు. ఆరెస్సెస్ లేబుల్‌ను తొలగించి, ఆరెస్సెస్, సమాజం కలిసికట్టుగా పని చేయాలని, దానికి సంబంధించిన కీర్తి మొత్తం సమాజానికే చెందాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/