భగవత్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

Mohan Bhagwat
Mohan Bhagwat

హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజయ సంకల్ప సభలో చేయనున్న ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సరూర్‌ నగర్‌లో జరగుతున్న ఈ సభకు ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. అయితే సభా ప్రాంగణానికి మరికాసేపట్లో భగవత్‌ చేరుకోనున్నారు. కాగా ఆయన తొలి సారి దేశ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనల క్రమంలో సభావేదికపై స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఎన్‌ఆర్‌సి, సిఎఎ, ఎన్‌పిఆర్‌లపై ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఆయన ప్రసంగం ఎలా ఉండనుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఆయన ప్రసంగంపై రాజకీయ వర్గాలోనూ ఆసక్తి నెలకొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/