విప్రో లో బైబ్యాక్‌లో సేల్

wipro
wipro

న్యూఢిల్లీ: దేశీయ మూడో అతిపెద్ద ఐటి సంస్థ విప్రో షేర్ల బైబ్యాక్ సందర్భంగా అజీమ్ ప్రేమ్‌జీ ప్రమోటర్ కంపెనీలు రూ.7,300 కోట్ల విలువైన 22.46 కోట్ల షేర్లను విక్రయించాయి. విప్రో మొత్తం 32.3 కోట్ల షేర్లను రూ.325 చొప్పున కొనుగోలు చేసింది. దీంతో బైబ్యాక్ కోసం వినియోగించిన మొత్తం విలువ రూ.10,499.99 కోట్లు. గత నెలలో విప్రో బైబ్యాక్ ప్లాన్ ముగిసింది. విప్రో బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ సమాచారం ఇచ్చింది.

బైబ్యాక్‌లో ఎల్‌ఐసి 1.34 కోట్ల షేర్లను విక్రయించినట్లు విప్రో తెలిపింది. అమ్మిన వాటాల సంఖ్యనూ చూస్తే.. జాష్ ట్రేడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ భాగస్వామి 6.12 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ పార్ట్‌నర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజిమ్ ట్రేడర్స్ 6.03 కోట్లు, హషం ట్రేడర్స్ ప్రాతినిధ్యం వహిస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ భాగస్వామి 5.02 కోట్ల షేర్లు బైబ్యాక్ కింద అంగీకరించారు. అలాగే అజీమ్ ప్రేమ్‌జీ ట్రస్ట్ 4.05 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ 1.22 కోట్లు కూడా బైబ్యాక్ ఆఫర్ కింద ఆమోదం తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/