భారతీయ మార్కెట్లకు రూ.72,000 కోట్ల పెట్టుబడులు

FIIS
FIIS


న్యూఢిల్లీ: అమెరికన్‌ ఫెడరల్‌ బ్యాంకు వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం, అంతర్జాతీయ మార్కెట్ల మందగమనం వంటి కారణాలతో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐఎస్‌) దేశీయ స్టాక్‌ మార్కెట్లవైపు చూస్తున్నారు. 2019 ఏప్రిల్‌ ప్రారంభం వరకూ అంటే 3 నెలల వ్యవధిలోనే విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు రూ.70వేల కోట్ల పెటుట్బడులను మార్కెట్లోకి మళ్లించారు. ఇది గత ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే గరిష్టంగా ఎనలిస్టులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా మార్కెట్లు నీరసంగా ఉండడం, అమెరికన్‌ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచకపోవడం, అమెరికా చైనా వాణిజ్యయుద్ధ భయాలు వంటివి భారతీయ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలను బుల్లిష్‌ ట్రేడర్లుగా మార్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ నెట్‌ బయ్యర్లుగా మారిపోయారని విశ్లేషకులు పేర్కొన్నారు. మే చివరినాటికల్లా కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం మరింత ఎక్కువగా ఉండొచ్చని, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల ఇన్వెస్ట్‌మెంట్లు జూన్‌ నాటికి లక్ష కోట్ల రూపాయిలకు చేరొచ్చని ఇండియా ఇన్ఫోలైప్‌ లిమిటెడ్‌ భావిస్తోంది. 2019 ఫిబ్రవరిలో రూ.17,220కోట్ల పెట్టుబడులు పెట్టిన ఎఫ్‌ఐఐలు, మార్చిలో గరిష్టంగా రూ.33,981కోట్లను, ఏప్రిల్‌లో రూ.21,032కోట్లను దేశీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/