వసతి గృహంలో రూ.70 లక్షలు పట్టివేత

money
money

చీరాల: ప్రకాశం జిల్లా వేటపాలెం మండం ప్రసాద్‌నగర్‌లో ఉన్న ఓ ప్రైవేటు వసతిగృహంలో రూ.70 లక్షల నగదు లభ్యమైంది. అయితే పక్కా సమాచారంతో ఈరోజు ఉదయం పోలీసులు జరిపిన సోదాలో వసతి గృంలో బీరువాలో ఉన్న రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఎన్నికలు వస్తున్న సందర్భంగా వసతి గృహంలో డబ్బు ఎవరు దాచి ఉంచారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.ఈ తనిఖీల్లో చీరాల గ్రామీణ సీఐ బి.ప్రసాద్‌, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు పాల్గొన్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/