రైతు మరణిస్తే రూ.7లక్షలు!

కొయ్యలగూడెం: వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ ఎన్నికల సందర్భంగా కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఏపిలో రైతు ఆత్మహత్య చేసుకున్నా తన ప్రభుత్వం రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని ఆయన కీలక హామీ ఇచ్చారు.రైతులకు ఆర్థిక సాయం విషయంలో తొలి సభలోనే చట్టాన్ని తెస్తామని అన్నారు. రైతు ఎలా మరణించారని ఎవరూ అడగరని అన్నారు. ఇకపై రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా చూస్తానని చెప్పారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం రావాలన్న లక్ష్యం తనదని అన్నారు. ప్రజలంతా ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని అన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి తీరుతానని చెప్పారు.
మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/