మజిలీ..తొలి వారంలో రూ.17.35 కోట్లు వసూలు

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన మజిలీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ హిట్ ఫెయిర్ నటించిన మజిలీ..తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.17.35 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. చైతూ కెరీర్లోనే మొదటి వారంతంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా మజిలీ నిలిచినట్లు టాక్. మజిలీ చిత్రం నైజాంలో రూ.5.35 కోట్లు వసూలు చేయగా..ఓవర్సీస్లో రూ.2.25 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. సీడెడ్తోపాటు ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్, గుంటూరు, నెల్లూరు, కర్నాటక ప్రాంతాల్లో కూడా మంచి వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.
మరిన్ని తాజా తెర-సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి:
https://www.vaartha.com/news/movies/