మత్స్యకార కుటుంబాలకు రూ.10వేలు పరిహరం

ఏపి సర్కారు మరో కీలక నిర్ణయం

ap state logo
ap state logo

అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఈ సందర్బంలో ఏపి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో మందికి చేపల వేట జీవనాధారంగా ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలపాటు చేపలవేట నిషేదించడంతో మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. దీంతో వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లభ్దిదారుల కుటుంబాలకు రూ.10 వేలు పరిహరం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం అధికారులు లభ్ధిదారులను గుర్తించే పని ప్రారంభించారు. మరో 20 రోజలలో వారికి సాయం అందించాలని ప్రభుత్వం సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/