రూ.1లక్షా 22 వేల కోట్లకు పేటిఎం టర్నోవర్‌!

paytm
paytm

ముంబై,: 1.5నుంచి 2 బిలియన్‌ డాలర్ల వరకు సమీకరించేందుకు ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ సేవల కంపెనీ సిద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీలో ఇన్వెస్టర్లుగా ఉన్న సాఫ్ట్‌బాంకు విజన్‌ ఫండ్‌, ఆలీబాబా ఫైనాన్షియల్‌ అనుబంధ సంస్థ యాంట్‌ ఫైనాన్షియల్‌ నుంచి ఈ నిధులు సేకరించే అవకాశంఉంది. పేటిఎంకు పేరెంట్‌ కంపెనీ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ చేపడుతున్న ఈ తాజా ఫైనాన్సింగ్‌తో, కంపెనీ వాల్యుయేషన్‌ 16నుంచి 18బిలియన్‌ డాలర్లకు పెరగనుందని తాజా పెట్టుబడుల రౌండ్‌లో కొత్త ఇన్వెస్టర్లు జతయ్యే అవకాశముందని తెలుస్తోంది. గతేడాది వారెన్‌ బఫెట్‌కు చెందని బెర్క్‌షైర్‌ హాథ్‌వే సంస్థ 300 మిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేసినప్పుడు 10 బిలియన్‌ డాలర్లుగా పేటిఎంను వాల్యుయేషన్‌ చేశారు. కొన్ని నెలల క్రితం నిర్వహించిన రెండవ రౌండ్‌లో 16 బిలియన్‌ డారల్ల కంపెనీ వాల్యుయేషన్‌ జరిగింది. ప్రస్తుత ఇన్వెస్టర్‌ ఓ కొత్త పెట్టుబడిదారుని ఈ వాటా విక్రయం చేయడంతో, ఈ నిధులు కంపెనీ ఖాతాలోకి రావు. అయితే సాఫ్ట్‌బాంకు, యాంట్‌ ఫైనాన్షియల్స్‌ నిధులు ఇప్పటికే కంపెనీలోకి రాగా, కొత్త ఇన్వెస్టర్లతో కంపెనీ చర్చలు జరుపుతోంది. తద్వారా 2 బిలియన్‌ డాలర్లను సమీకరించబోతోంది. కానీ, ఇది ఇంటర్నల్‌ రౌండ్‌గా ఉండే అవకాశముంది అని తెలుస్తోంది. 2017లో పేటిఎంలో పెట్టుబడి చేసిన సాఫ్ట్‌బాంయకుకు 19 శాతం వాటా ఉంది. యాంట్‌ ఫైనాన్షియల్‌ ద్వారా, అలాగా ఆలీబాబా నేరుగా చేసిన పెట్టుబడులతో, వన్‌ 97 కమ్యూనికేషన్స్‌లో ఈ గ్రూప్‌నకు 38శాతం వాటా ఉంది. 2016లో జరిగిన పెద్దనోట్ల తర్వాత వీటి అవసరం మరింతగా పెరిగింది. గత నెలలో యూపిఐ ప్లాట్‌ఫాంపై పేటిఎం ద్వారా 22.1కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇ-కామర్స్‌ వ్యాపారం క్రమంగా కాస్త నెమ్మదించడంతో, ఈ నిధుల సేకరణ కొంత క్లిష్లతరంగా మారింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన పేటిఎం మాల్‌, గ్లోబల్‌ మార్కెట్‌ ప్లేస్‌ అయిన ఈబేతో తాజా కేపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌పై చర్చలు జరుపుతుండగా, గత రౌండ్‌లతో పోలిస్తే తక్కువ వాల్యుయేషన్‌కే ఈ డీల్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/