దసరాకు దిగుతున్న ఆర్ఆర్ఆర్.. ఇక అరాచకమే!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని యావత్ సినీ జనం ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అయితే ఈ సినిమాను తొలుత జూలై 30, 2020లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మూతపడటంతో అది కుదర్లేదు. దీంతో ఈ సినిమాను సంక్రాంతి 2021కి రిలీజ్ చేయాలని జక్కన్న అండ్ టీమ్ భావించారు. కానీ అనుకున్నదానికంటే ఈ సినిమా మరింత ఆలస్యం అవుతుండటంతో వేసవి కానకుగా ఆర్ఆర్ఆర్‌ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇప్పుడు అది కూడా కుదిరేలా కనిపించడం లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటం, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సమయం పడుతుండటంతో ఈ సినిమాను వచ్చే దసరాకు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. దసరా సీజన్ అయితే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందని, అందుకే ఈ సమయంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయాలని జక్కన్న నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఆర్ఆర్ఆర్ కోసం మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.