10000 స్క్రీన్లలో విడుదల కాబోతున్న RRR

RRR ఈ మూవీ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి నుండి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడం ..ఇద్దరు క్రేజీ హీరోలు నటిస్తుండడం ..బాలీవుడ్ , హాలీవుడ్ నటి నటులు , సాంకేతిక నిపుణులు పనిచేయడం తో ఈ సినిమాను చూడాలని అంత వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపులు ఏమాత్రం తగ్గకుండా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు నిర్మాత దానయ్య. జనవరి 07 న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా 10000 స్క్రీన్లలో విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో పాటుగా పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. యూఎస్ఏలోనే సుమారు 2500 స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇదే జరిగితే ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ఫై ఇంకాస్త దృష్టి సారించారు. ఇప్పటికే చిత్రం నుండి పోస్ట‌ర్స్, వీడియోలు విడుద‌ల చేయ‌గా వాటికి భారీ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే తారక్ గిరిజన వీరుడు కొమురం భీమ్‌గా కనిపించనున్నారు.