ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా వేయబోతున్నారా..?

ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా వేయబోతున్నారా..?

ఇప్పటీకే రెండుసార్లు రిలీజ్ వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ మూవీ..మరోసారి వాయిదా పడనుందనే వార్తలు ఫిలిం సర్కిల్లో బలంగా వినిపిస్తున్నాయి. బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడం..భారీ బడ్జెట్.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడ్డారట. ఈ కొత్త వేరియంట్ వల్ల మళ్లీ మరోసారి లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు కూడా కథనాలు వినిపిస్తున్నాయి ఇప్పటికే పలు దేశాల్లో మళ్లీ ఎప్పటిలానే ఆంక్షలు విధించారు. థియేటర్స్ కూడా మూతపడుతున్నాయి. ఇక జనవరిలో మళ్లీ ఆ ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందనే ఆలోచనలు చేస్తున్నారు చిత్ర యూనిట్.

ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో నమ్మకం గా ఉంటేనే సినిమాను విడుదల చేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడు. సినిమాకు దాదాపు 450 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టారు. కాబట్టి అందరి లైఫ్ కూడా చాలా రిస్క్ లో ఉన్నట్లు. అందుకే రాజమౌళి రిస్క్ చేయవద్దు అని డిసైడ్ అయ్యాడట. జనవరి 07 వరకు పరిస్థితులు బాగానే ఉంటె రిలీజ్ చేద్దాం లేదంటే వాయిదా వేద్దాం అన్నట్లు రాజమౌళి నిర్మాతకు చెప్పినట్లు వినికిడి. మరి ఏంజరుగుతుందో చూడాలి.