RRR గ్లింప్స్ రిలీజ్ : ఏంటి రాజమౌళి ఇది

యావత్ సినీ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం RRR (ఆర్ఆర్ఆర్). బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం..ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలు గా నటిస్తుండడం..పాన్ ఇండియా మూవీ గా రాబోతుండడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొనిన్నాయి. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జనవరి 07 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
ఈ తరుణంలో గ్లిమ్స్ వీడియోను విడుదల చేసి..రోమాలు నిక్కబొడిచేలా చేసారు. గ్లిమ్స్ వీడియోలో రాజమౌళి అందరు నటీనటులను కవర్ చేసి చూపించాడు. మరీ ముఖ్యంగా చిత్ర హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను హై ఓల్టేజ్‌గా చూపించాడు. అలాగే, యాక్షన్ సీక్వెన్స్‌ను బాగా హైలైట్ చేశాడు.
కేవలం 45 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ రివీల్ చేస్తూ భారీ విజువల్స్‌తో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. కట్టిపడేస్తున్న సీన్స్‌కి కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రోమాలు నిక్కబొడిచేలా చేస్తున్నాయి. భారతీయ సినిమా వైభవాన్ని మరోసారి ఆవిష్కృతం చేయబోతున్నామంటూ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు రాజమౌళి.
