ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా.. పిచ్చ క్లారిటీతో ఉన్న జక్కన్న

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కి్స్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో జూ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు తెరలేపడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను పీరియాడికల్ ఫిక్షన్ చిత్రంగా రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాను మరోసారి వాయిదా వేయబోతున్నారనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో పలు భారీ చిత్రాలు వరుసగా వాయిదా పడుతున్నాయి. దీంతో ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడుతుందనే టాక్ వినిపిస్తోంది.

కానీ ఈ సినిమా దర్శకుడు రాజమౌళి మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వాయిదా వేయకూడదని చూస్తున్నాడట. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిందని, మరోసారి వాయిదా వేస్తే ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన భావిస్తు్న్నాడు. అందుకే ఈ సినిమాను ఏదేమైనా అక్టోబర్ 13న రిలీజ్ చేయాలని ఆయన భావిస్తు్న్నాడట. మరి అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి.