ఆర్ఆర్ఆర్ నుండి దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గత నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం తో విడుదలైన ప్రతి చోట వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చూపించింది. ఇక నార్త్ లోను ఈ మూవీ 200 కోట్లు రాబట్టి పలు రికార్డ్స్ నమోదు చేసింది.

ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇదిలా ఉంటె చిత్రంలోని ‘దోస్తీ’ పాటను చిత్ర బృందం గురువారం విడుదల చేిసింది. తారక్‌, రామ్‌చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో సిరివెన్నెల సీతారామశాస్ర్తి సాహిత్యం అందించారు. కీరవాణి తనయుడు కాలభైరవ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ‘నాటు నాటు…’, ‘కొమ్మా ఉయ్యాలా…’ పాటలు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇప్పుడు వాటి జాబితాలో దోస్తీ చేరడం ఖాయం.

YouTube video