ఆర్ఆర్ఆర్ సెన్సార్ పూర్తి..

బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంతో సహ అనేక బాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటించడం..భారీ బడ్జెట్.. బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. శుక్రవారం విడుదలైన జననీ సాంగ్ సినిమా ఫై మరింత హైప్ తెచ్చింది. ఈ తరుణంలో ఈ సినిమా సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసిందనే వార్త వైరల్ గా మారింది.

సాదారణంగా అయితే సినిమా విడుదలకు కేవలం వారం పది రోజుల ముందు మహా అయితే రెండు వారాల ముందు సెన్సార్ కు వెళ్తారు. కాని ఆర్ ఆర్ ఆర్ సినిమాకు మాత్రం నెలన్నర ముందే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేశారని అంటున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడంతో సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం కోసం డిసెంబర్ మొదటి వారంలో ప్రమోషన్స్ మొదలు పెట్టే ఉద్దేశ్యంతో ముందుగానే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా మూడు గంటల నిడివి వచ్చిందట. ఈమద్య కాలంలో రెండు గంటలకు కాస్త అటు ఇటుగానే సినిమాలు ఉంటున్నాయి. అలాంటిది ఈ సినిమా మూడు గంటలు అంటే ఖచ్చితంగా ఎంత కంటెంట్ జక్కన్న సినిమాలో పెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.

సెన్సార్ బోర్డు ఈ సినిమా కు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా లో యుద్ద సన్నివేశాలు ఉండటం వల్ల యూ/ ఏ వచ్చిందట. సినిమాలో ఉన్న కంటెంట్ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.