వరి పిండి రొట్టె

Roti

కావలసినపదార్థాలు

వరి/ బియ్యం పిండి – 250 గ్రాములు
పచ్చిమిర్చి – 4
ఉల్లిపాయ – 1
కరివేపాకు- 2 రెబ్బలు
కొత్తిమీర – కొద్దిగా
జీలకర్ర – 1 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం
బియ్యంపిండి జల్లించుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర తగినంత ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోసి కలుపుకుంటూ కాస్త మెత్తగా ఉండేలా తడిపి కాస్త నూనె వేసి ఉంచాలి. పది నిమిషాల తరువాత పిండిముద్దను బాగా పిసికి చిన్న బత్తాయి సైజు ముద్దలు చేసుకోవాలి. పెనం పైన నూనె రాసి ఈ ముద్ద పెట్టి నూనె రాసుకున్న చేతివేళ్లతో పలుచగా వత్తుకోవాలి. ఇప్పుడు దీనిని పొయ్యి మీద పెట్టి కాస్త నూనె వేసి నిదానంగా కాల్చుకోవాలి.
ఒకవైపు దోరగా కాలిన తర్వాత తిరగేసి రెండోవైపు కూడా కాల్చుకుని టమాటా పచ్చడి లేదా
పెరుగులో వేడిగా తినాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/