రోజరీ బయోటెక్‌ ఐపిఒకు రెడీ

Rossari Biotech
Rossari Biotech

ముంబయి: కెమికల్‌ మ్యానుఫ్యాక్షరింగ్‌ కంపెనీ అయిన రోజరీ బయోటెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు రెడీ అవుతోంది. ప్రైమరీ మార్కెట్‌ ద్వారా దాదాపు రూ.700కోట్లు సమీకరించేందుకు రెడ్‌హెరింగ్‌ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ రూ.700కోట్ల ఐపిఒలో ప్రధానంగా రూ.150కోట్ల ఫ్రెష్‌ ఇష్యూతో పాటు ప్రమోటర్ల 1.05కోట్ల ఆఫర్‌ ఫర్‌ సేల్‌ షేర్లు కూడా ఉండబోతున్నాయి. ఐపిఒలో భాగంగా సుమారు రూ.100 కోట్ల విలువైన షేర్లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా జమచేసుకునేందుకు కంపెనీ యోచిస్తోందని ప్రాస్పెక్టస్‌ చూస్తే అర్థమవుతోంది. ఒకవేళ ఫ్రీ ఐపిఒ ప్లేస్‌మెంట్‌ లభిస్తే, ఐపిఒ సైజ్‌ కొంత తగ్గుతుంది. సమీకరించిన నిధులను విస్తరణతో పాటు రుణాలను తీర్చేందుకు వినియోగించబోతోంది ఈ సంస్థ. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ కేపిటల్‌ ఈ ఇష్యూకు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించబోతున్నారు. ఎఫ్‌ఎంసిజి, అపెరల్‌, పౌల్ట్రీ, జంతు సంబంధ ఆహార పరిశ్రమలకు ప్రత్యేకమైన కస్టమైజ్డ్‌ సొల్యూషన్స్‌ సహా ప్రొడక్షన్‌ అవసరాలకు అనుగుణమైన సేవలను రోజరీ బయోటెక్‌ అందిస్తుంది. ఇక కెమికల్‌ ప్రొడక్ట్‌ క్యాటగిరిలో ప్రముఖ టెక్స్‌టైల్‌ సంస్థలైన అరవింద్‌, రేమండ్స్‌, అస్నూర్‌ టెక్స్‌, భాస్కర్‌ ఇండస్ట్రీస్‌, యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ కెమికల్‌, షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/