రాజమండ్రి టీడీపీ ఎంపీగా రూప నామినేషన్

రాజమండ్రి :రాజమండ్రి స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ కోడలు రూపను టీడీపీ బరిలోకి దింపింది.  నామినేషన్ దాఖలు చేసిన టీడీపీ ఎంపీగా మాగంటి రూప వెంకటేశ్వరనగర్‌లోని తన స్వగృహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. అనంతరం నగరపాలక సంస్థలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ ర్యాలీలో సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని చెప్పారు. సీఎం చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా ఎంతో చేశారని కొనియాడారు.  మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించింది టీడీపేనని గుర్తుచేశారు. ఇప్పుడు పసుపు-కుంకమ ద్వారా మహిళలకు చేయూత అందిస్తున్నారని రూప తెలిపారు.


https://www.vaartha.com/andhra-pradesh/మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి :