రొమాంటిక్ ట్రైలర్ టాక్..యూత్ కు మంచి రొమాంటిక్ కిక్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న‌ రొమాంటిక్ చిత్రం కోసం క‌థ‌, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్ తరువాత పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై  పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 29న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్..ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఈ చిత్ర బృందానికి స్పెషల్ విషెస్ చెప్పారు ప్రభాస్. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే… టైటిల్ కు తగ్గట్టుగానే రొమాంటిక్ సన్నివేశాలతో యూత్ కు మంచి కిక్ ఇచ్చారు.

ఇక ఈ సినిమాను చూస్తుంటే పూరి జగన్నాద్ ఇడియట్.. లోఫర్ ఇంకా ఆయన ఇతర సినిమాలను చూసినట్లుగా ఉన్నాయి. హీరో చాలా రఫ్ గా ఒక గాలోడి మాదిరిగా పూరి సినిమాలు ఉంటాయి. ఈ రొమాంటిక్ కూడా పూరి మార్క్ సినిమా అన్నట్లుగానే అనిపిస్తుంది. ఈ సినిమాకు కథ.. స్క్రీన్ ప్లే మరియు మాటలు పూరి జగన్నాద్ అందించడంతో ఆయన గత సినిమాల తరహాలోనే ఈ సినిమా ఉండబోతుందని తేలిపోయింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపించబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్థం అవుతోంది.

YouTube video