వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్

వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్
A Still from Bheeshma

డ్యాన్స్ ఫ్లోర్ పై నితిన్ స్పీడ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. అందాల రష్మికతో ఎంతో ఇదిగా కమిటైపోయినట్టే కనిపిస్తున్నాడు ఇప్పటివరకూ రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే నితిన్ నుంచి మరో క్లాసిక్ లవ్ స్టోరీని ఆశించవచ్చు. రష్మికతో నితిన్ కి ఓ రేంజులో కుదిరింది. ఈ జోడీ పిక్చర్ పర్ఫెక్ట్ అనేస్తే తప్పేమీ కాదు.
ఇప్పటివరకూ వచ్చిన పోస్టర్లు.. టీజర్ ప్రతిదీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. సింగిల్స్ ఆంథెమ్ కి అద్భుత స్పందన వచ్చింది.  తాజాగా ‘భీష్మ’ పాటల ప్రమోషన్ మొదలైంది. తొలి సింగిల్ వాటే బ్యూటీ.. ఈనెల 31న రిలీజ్ కానుంది. ఇప్పుడు వాటే బ్యూటీ అంటూ రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా రిలీజ్ కానుంది. అప్పటివరకూ ఈ ట్రీట్ కొనసాగుతుందిట. `ఛలో` ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/