చంద్రబాబు చీటర్, జగన్ లీడర్..బోత్ ఆర్ నాట్ సేమ్ : రోజా

Mla Roja addressing the Women's Day celebrations
Mla Roja addressing the Women’s Day celebrations

Vijayawada : మహిళల జీవితాలను నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు అని నగరి ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు చీటర్ అని దుయ్యబట్టారు. మంగళ వారం విజయవాడ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ప్రసంగించారు. నేడు రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలో మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయటం జరిగిందన్నారు . రాష్ట్రంలో 32 లక్షల మంది మహిళలకు ప్రభుత్వం ఇంటిపట్టాలు ఇచ్చిందని తెలిపారు.

ఎంతో మంది మహిళల జీవితాలను నాశనం చేసిన కాలకేయుడు చంద్రబాబు నాయుడు అని, మహిళల జీవితాల్లో వెలుగు నింపిన కారణజన్ముడు ప్రస్తుత సీఎం జగన్ .. అంటూ .’ బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్‌”’ అని పేర్కొన్నారు. చంద్రబాబు ఛీటర్‌.. జగన్ లీడర్, చంద్రబాబు మోసగాడు.. జగన్ మొనగాడు అంటూ ఉద్వేగ పూరిత ప్రసంగం చేశారామె. ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. ”చంద్రబాబు, జగన్ కు మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది.” అని పేర్కొన్నారు.

చెలి (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం: https://www.vaartha.com/specials/women/