చంద్రబాబుపై రోజా విమర్శలు

గతంలో కేంద్ర బలగాలు రాకుండా జీవో ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర బలగాలు రావాలంటున్నారు: ఎమ్మెల్యే రోజా

అమరావతి: టీడీపీ నేత‌ల తీరుకి నిర‌స‌న‌గా చిత్తూరు జిల్లా పుత్తూరులో వైస్సార్సీపీ నేత‌లు ఈ రోజు నిర‌స‌న తెలిపారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నేత‌లు అనంతరం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

‘చంద్ర‌బాబు నాయుడు గారు, లోకేశ్ క‌లిసి ప‌ట్టాభిలాంటి కుక్క‌ల‌తో ప్రెస్ మీట్ పెట్టించి, జ‌గ‌న్ గారిని, వారి అమ్మ విజ‌య‌మ్మ‌పై దారుణ‌మైన వ్యాఖ్య‌లు చేయించ‌డం స‌రికాదు. వారి తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం ఖూనీ అనిపోయింద‌ని చంద్ర‌బాబు నాయుడు అంటున్నారు. ఎన్టీఆర్ కు చంద్ర‌బాబు వెన్నుపోటుపొడిచి సీటు లాక్కున్నప్పుడే ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయిపోయింది. కేంద్ర బ‌ల‌గాలు ఏపీకి రావాల‌ని చంద్ర‌బాబు అంటున్నారు. గతంలో కేంద్రబ‌ల‌గాలు రాకుండా ఆయ‌నే జీవోలు విడుద‌ల చేశారు. ఇప్పుడు ఆయ‌నే మ‌ళ్లీ కేంద్ర బ‌ల‌గాలు రావాల‌ని అంటున్నారు’ అని రోజా మండిప‌డ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/