సొంత పార్టీ నేతలపై రోజా కీలక వ్యాఖ్యలు

వైస్సార్సీపీ లో వెన్నుపోటు నాయకులున్నారు..రోజా

నగిరి: ఏపీలో మున్సిపల్ ఎన్నిక‌ల సందర్బంగా వైస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా నగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు వైసీపీలో వెన్నుపోటు నాయకులున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైస్సార్సీపీలో కొందరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని రోజా ఆరోపించారు. వైస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ కొందరు మీడియా ముందుకు వచ్చి వైస్సార్సీపీ రక్తం తమలో ప్రవహిస్తోందని చెప్పడం ఆశ్యర్యం కలిగిస్తోందని రోజా విమర్శించారు.


కొంతమంది నాయకులు తమ అనుచరులను వైస్సార్సీపీరెబెల్స్‌గా పోటీకి నిలబెట్టి పార్టీ అభ్యర్థులను ఓడించాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. రెబెల్స్‌ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతానని ఆమె పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని రోజా కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగానైతే వైస్సార్సీపీ ఘన విజయం సాధించిందో అదే విధంగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైస్సార్సీపీ ఘన విజయం సాధిస్తుందని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్నారని ఆమె అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/