సర్వేల ఫై మంత్రి రోజా ఫైర్..

ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా తాజాగా వెలువడిన సర్వే ఫై నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విఐపీ దర్శన సమయంలో మంత్రి రోజా, నటి రవళి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ సర్వేల ఫై చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేశారు. పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు. బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని అందరు బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.

బుధువారం మాజీ మంత్రులు పేర్ని నాని , కొడాలి నాని లు సైతం ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎమ్మెల్యే పేర్ని నాని బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉంది. టీడీపీకి రాజ‌కీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోని సంస్థ వైసీపీకి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు ఇవ్వ‌కుండా మ‌రెలా ఇస్తుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పవన్‌ కల్యాణ్‌ ద్వారా టీడీపీ గ్రాఫ్‌ పెంచుకోవాలని చూశారు. కానీ, అలా జరగలేదు. తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్‌ లేవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింది. దీంతో, ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు. మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్‌ సర్వేను బయటకు వదిలారని నాని ధ్వజమెత్తారు. ఇలాంటి సర్వేలు జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఏమీ చేయ‌లేవ‌న్న నాని.. జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌ నాయకత్వంపైనా ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయ‌ని నాని పేర్కొన్నారు.

కొడాలి నాని మాట్లాడుతూ… ‘కుప్పంలో చంద్ర‌బాబుతో రాజీనామా చేయించి మ‌ళ్లీ పోటీ చేయించి గెలవ‌మ‌ని స‌వాల్ విసురుతున్నాను’ అంటూ ఆయ‌న టీడీపీకి స‌వాల్ విసిరారు. అంతేకాకుండా కుప్పంలో చంద్ర‌బాబు రాజీనామా త‌ర్వాత ఆయ‌న పోటీ చేసినా, లేదంటే ఆయ‌న కుమారుడు నారా లోకేశ్ పోటీ చేసినా త‌మ‌కు ఓకేనంటూ నాని స‌వాల్ విసిరారు. బోగ‌స్ స‌ర్వే చూసుకుని మురిసిపోతున్న దుష్ట‌చ‌తుష్ట‌యానికి, దాన్ని అచ్చేసిన మీడియాకి ఓపెన్ చాలెంజ్ చేసారు.