వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు తరిమికొడతారంటూ రోజా ఆగ్రహం

వైసీపీ మంత్రి రోజా మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు, విద్యార్థులు, రైతులు తరిమికొడతారని రోజా అన్నారు. ట్లాడుతూ, ఒక్క చోట గెలవలేని పవన్‌.. జగనన్నను ఓడిస్తాననడం సిగ్గు చేటన్నారు. ‘‘బాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు గ్రామాల్లో తిరిగి విషం చిమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్‌ ఏమైనా దేవుడా.. జ్యోతిష్యుడా’’ అంటూ రోజా విరుచుకుపడింది.

మహిళలని చూడకుండా మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలని పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును మహిళలు, విద్యార్థులు, రైతులు తరిమికొడతారని అన్నారు. పవన్ కల్యాణ్ తన కార్యకర్తలతో ఏ ఎన్నికలకు, ఏ జెండాను మోయిస్తాడో తెలియని పరిస్థితి ఉందని, పవన్ కల్యాణ్ అభిమానులు ఈ విషయాన్ని గ్రహించాలని ఆమె సూచించారు. అసలు పవన్ కల్యాణ్ ఏ పార్టీకి పనిచేస్తున్నారో తెలియని గందరగోళంలో అభిమానులున్నారన్నారు. చిరంజీవి ఒకప్పుడు సొంతంగా నిలబడి పోటీ చేశారని, ఆ విలువలు పవన్ కు లేవా అని ప్రశ్నించారు.

కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. సీఎం జగన్‌ తప్పించుకుని పారిపోలేదన్నారు. 14 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఒక్కరోజైనా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చేశారా?. క్విట్ చంద్రబాబు, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదంతో ప్రజలు చంద్రబాబును మొన్నటి ఎన్నికల్లో తరిమికొట్టారన్నారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొస్తుండటంతో వాన పాములు కూడా లేచి బుస కొడుతున్నాయని’’ రోజా ఎద్దేవా చేశారు.