‘చంద్రబాబు నాయుడా.. శవాల నాయుడా..?’ అంటూ రోజా ఫైర్

గుంటూరు లో ఆదివారం చంద్రబాబు జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించి వెళ్లిపోయిన అనంతరం తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన పట్ల అధికార పార్టీ విమర్శల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే కందుకూరు లో జరిగిన టీడీపీ సభ లో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించగా..అది మరచిపోకముందే గుంటూరు లో ముగ్గురు మరణించడం తో వైస్సార్సీపీ చంద్రబాబు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఇప్పటికే పలువురు నేతలు ఈ ఘటన ఫై స్పందించగా..మంత్రి రోజా సైతం చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలే చేసింది. ‘ఈయన చంద్రబాబు నాయుడా.. శవాల నాయుడా..?’ అంటూ మండిపడింది. సోమవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఐరన్ లెగ్..వాళ్ళ కొడుకు కూడా ఐరన్ లెగ్ అయ్యారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ప్రజల ప్రాణాలు తీస్తున్న వారు ఎవరైనా ఉపేక్షించం. జనం రాక చీరలు, కానుకలు ఇస్తారని పిలిచి చంద్రబాబు జనాన్ని చంపుతున్నారు. ఖచ్చితం గా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతాం. పనికిమాలిన వాటికి చెప్పులు చూపించే పవన్ కళ్యాణ్ మహిళలు ప్రాణాలు పోతే పట్టదా..? పవన్ కళ్యాణ్ ప్యాకేజికి తప్ప పాలిటిక్స్ కి పనికి రాడా..? ఇదేం ఖర్మ రా..బాబు అని ప్రజలు అనుకుంటున్నార’ని రోజా పలు విమర్శలు గుప్పించారు.

ఇక జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు రాష్ట్రానికి వస్తాడని, లోకేష్ పప్పు తినటానికి మాత్రమే పనికి వస్తాడని, దత్త పుత్రుడు పవన్ ఏమో రెండు చోట్లా ఓడిపోయాడని అన్నారు. ‘చంద్రబాబు చంకలో కూర్చోవటం మినహా మరొక పని లేదు దత్త పుత్రుడికి’ అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.